VIDEO: ఎన్టీఆర్ స్టేడియంలో వెలుతురు సమస్య.. వాకర్స్ ఇబ్బందులు
మహబూబాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టేడియంలో సగం లైట్లు మాత్రమే వెలుగుతుండగా, మిగతావి పనిచేయడం లేదు. దీంతో ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం కష్టమవుతోంది. చీకటి కారణంగా ప్రమాదాల ముప్పు ఉందని వాకర్స్ చెబుతూ, అధికారులు వెంటనే లైట్లు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.