మునగ చెట్టు ఎక్కి కూర్చున్న ఎలుగుబంటి పిల్ల

మునగ చెట్టు ఎక్కి కూర్చున్న ఎలుగుబంటి పిల్ల

SKLM: వజ్రపుకొత్తూరు మండలం బర్రివాణిపేటలో ఆదివారం రాత్రి ఓ ఎలుగుబంటి పిల్ల హల్చల్ చేసింది. గ్రామంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి పిల్లను చూసిన గ్రామ సింహాలు (కుక్కలు) అరవడంతో ప్రాణ భయంతో సమీపంలో ఉన్న మునగ చెట్టుపైకి ఎక్కి తన తల్లి కోసం అరవడం మొదలు పెట్టింది. ఈ అరుపులు విన్న గ్రామస్తులు తల్లి ఎలుగు ఎక్కడ ఎవరిపై దాడి చేస్తుందోనని భయాందోళన చెందారు.