స్కూల్లో ముందస్తు సమ్మక్క–సారక్క జాతర వేడుకలు
WGL: వర్ధన్నపేట పట్టణంలో ఆల్‌ఫోర్స్ స్కూల్లో సమ్మక్క–సారక్క జాతరను ముందస్తుగా భక్తిశ్రద్ధలతో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ గ్రూప్ చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, సమ్మక్క–సారక్క జాతర తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవం, పోరాట చరిత్రకు ప్రతీక అని తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.