'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'
BDK: కొత్తగూడెం క్లబ్‌లో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు AIYF నాయకులు తెలిపారు. MLA కూనంనేని సాంబశివరావు సారధ్యంలో ఈ మేళా జరగనుందన్నారు. నిరుద్యోగ యువత ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ.. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు.