నేటితో ముగియనున్న పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు

నేటితో ముగియనున్న పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు

NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 9నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు వివిధ రకాల ప్రత్యేక పూజలు, వాహనాలతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం పల్లకి సేవ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలియజేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.