'పద్ధతి మార్చుకోకపోతే.. జాబ్ నుంచే తొలగిస్తా'

ప్రకాశం: విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారికి ఉద్యో గం ఎందుకు? పద్ధతి మార్చుకోకపోతే టెర్మినేట్ చేసేస్తా అంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు. వాస్తవ వివరాలను నమోదు చేయకుండా పలువురు ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.