VIDEO: పత్తికొండలో స్వామివారి ఉత్సవాలు
కర్నూలు: పత్తికొండలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ప్రభోత్సవం, కల్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉత్సవ విగ్రహాలకు వేద పండితులు, పూజారుల ఆధ్వర్యంలో వసంతోత్సవం జరిపారు. అనంతరం దేవాలయం నుంచి గ్రామోత్సవం ప్రధాన వీధుల్లో సాగింది. భక్తులు పండ్లు, పూలు, టెంకాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.