'అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలి'

MNCL: రైతులకు ఎరువుల కొరత రానీయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికారపు అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. వానాకాలం వ్యవసాయ సీజన్ పనులు ముమ్మరం అయ్యాయని, ఈ సమయంలో రైతులు పంటలకు వివిధ ఎరువులు వేయాల్సి ఉందన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు.