బాల్య వివాహాలను అరికట్టాలి: కలెక్టర్
NRPT: జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, పలు మండలాల్లో నమోదైన బాల్యవివాహాల కేసుల పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. సరైన సమాధానాలు ఇవ్వని అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ దిశగా అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు.