అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు

అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు

మేడ్చల్: గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్‌లోని దోభిఘాట్ ఖాళీ స్థలం చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 3500 గజాల్లో నాళాకు ఒకవైపు అక్రమ కట్టడాలు, మరోవైపు స్థలం కబ్జా జరిగింది. దీంతో అధికారులు స్పందించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.