'మహనీయుల విగ్రహాల వద్ద శుభ్రత పాటించాలి'
PDPL: మహనీయుల విగ్రహాల వద్ద శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ రాజు మంథని మునిసిపల్ కమిషనర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. విగ్రహాల చుట్టూ వివిధ వర్గాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల వాటి ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. విగ్రహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.