పటేల్ 150వ జయంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం)ను పురస్కరించుకుని గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం (Statue of Unity) వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన హెలికాప్టర్ నుంచి సర్ధార్ పటేల్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు.