VIDEO: 'కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి'
కోనసీమ: ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. మామిడికుదురు మండలం నగరం తాడివారి మెరకలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులతో గ్రామీణ ప్రాంతాలలోని రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.