'అభ్యర్థుల గెలుపుకై అంకితభావంతో పనిచేయాలి'
BDK: ఈనెల 14వ తేదీన జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభ్యర్థుల గెలుపు కై అంకిత భావంతో పనిచేయాలని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పాల్వంచ అయ్యప్ప నగర్‌లోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.