రాహుల్ గాంధీ బీజేపీకి బీ-టీమ్: సీఎం
అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళంలో ప్రచారం జోరందుకుంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళం సీఎం పినరయి విజయన్ ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ-టీమ్ అని ఆరోపించారు. కాంగ్రెస్ కేవలం మాటలకే పరిమితమవుతోందన్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీని ఎదిరించడంలో విఫలమవుతోందని దుయ్యబట్టారు.