భారీ వాహనాల రాకపోకల పై జిల్లాలో తాత్కాలిక నిషేధం

భారీ వాహనాల రాకపోకల పై జిల్లాలో తాత్కాలిక నిషేధం

ELR: భారీ వాహనాల రాకపోకలపై జిల్లాలో తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ఎస్పీ ప్రతాప్ కిషోర్ మంగళవారం తెలిపారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథంలో ప్రజల భద్రత దృష్ట్యా, జిల్లా వ్యాప్తంగా నేషనల్ హైవేలు స్టేట్ హైవేలపై భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలుపుదల చేయాలన్నారు.