'పక్షుల చలివేంద్రం.. భూత యజ్ఞం'

'పక్షుల చలివేంద్రం.. భూత యజ్ఞం'

KKD: జిల్లాలో మండుతున్న ఎండలకు పక్షులు దాహంతో అల్లాడుతున్నాయి. కాబట్టి పక్షులకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్నారు పక్షి ప్రేమికులు. పక్షి కేవలం ఒక జీవి కాదు, అది పరబ్రహ్మ స్వరూపమని, ప్రతి జీవిలో ఆత్మతత్వం ఉంటుందని వేదం చెపుతుంది. కాబట్టి పక్షికి చిన్న పాత్రలో నీరు నింపితే దాహాన్ని తీర్చడమే కాదు మనలను కరుణను మేల్కొలిపే వైదిక కర్మగా మారుతుందని అంటున్నారు పక్షి ప్రేమికులు.