పెచ్చులు ఊడుతున్న మెట్రో ట్రైన్ పైకప్పు..!

HYD: మెట్రో రైలు పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయని పలువురు అంటున్నారు. ఏసీల వద్ద ఈ పరిస్థితి ఏర్పడిందని ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులు తెలిపారు. నిర్వహణపై మెట్రో అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. గత కొద్దిరోజులుగా ఈ పరిస్థితి ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.