విద్యుత్ వైర్లు తగిలి హార్వెస్టర్ లో చెలరేగిన మంటలు

జగిత్యాల: కథలాపూర్ మండలంలోని భూషణ్ రావు పేట గ్రామంలో హార్వెస్టర్ లో మంటలు చెలరేగాయి. శనివారం పొలంలో వరి కోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ కు మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి డ్రైవర్ తప్పించుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.