యపల్బాయి తండాలో దాసర వేడుకలు

యపల్బాయి తండాలో దాసర వేడుకలు

NLG: చందంపేట మండలం యపల్బాయి తండాలో దసరా పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామస్తులు తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అమ్మవారికి శోభాయాత్ర నిర్వహించి భక్తులు పూలమాలలు, కొబ్బరికాయలు సమర్పించారు. తండా ప్రజలు సంప్రదాయ పద్ధతుల్లో దసరా పండుగను జరుపుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.