అర్ధవీడు ప్రజలకు SI హెచ్చరికలు

అర్ధవీడు ప్రజలకు SI హెచ్చరికలు

KDP: ఇటీవల కురిసిన వర్షాలకు జంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని బ్రిడ్జి దగ్గర, వాగుల దగ్గర చేపలు పట్టడానికి ఎవరు వెళ్లవద్దని సోమవారం అర్ధవీడు SI సుదర్శన్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు ఎవరూ వెళ్ళరాదని అన్నారు. చిన్నారులపై వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.