'ఇంటి పంటతోనే ఆరోగ్యం సిద్ధిస్తుంది'

'ఇంటి పంటతోనే ఆరోగ్యం సిద్ధిస్తుంది'

Vsp: మన ఇంటి పంటతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం ఉద్ఘాటించారు. ఆదివారం భీమునిపట్నంలోని ఎస్.ఓ.ఎస్ బాలల గ్రామంలో దేశీయ కూరగాయల మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గంట పర్యావరణ పరిరక్షణకు, తోట పనికి కేటాయించాలని పిలుపునిచ్చారు.