VIDEO: గిన్నెలో ఇరుక్కున్న బాలుడు

VIDEO: గిన్నెలో ఇరుక్కున్న బాలుడు

కేరళలో ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఒక పెద్ద అల్యూమినియం వంట పాత్రలో ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రెస్క్యూ టీమ్ కట్టర్ల సహాయంతో పాత్రను చాలా జాగ్రత్తగా కోసి, బాలుడికి ఎలాంటి గాయం కాకుండా క్షేమంగా బయటకు తీశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.