సీఎంకు ఫిర్యాదు చేస్తా: MLA వరదరాజులు
AP: బంగారం వ్యాపారి శ్రీనివాసులును పోలీసులు కొట్టారని MLA వరదరాజుల రెడ్డి ఆరోపించారు. ఆయన సోదరులను అక్రమంగా నిర్భంధించారని అన్నారు. సివిల్ పంచాయితీలో పోలీసుల జోక్యం ఏంటని ప్రశ్నించారు. రూ. 7కోట్ల విలువైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారని తెలిపారు. పోలీసుల తీరుపై చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.