అరుణాచల యాత్రకు ప్రత్యేక బస్సు

GNTR: ఈ నెల 12న పౌర్ణమి గిరిప్రదక్షిణ సందర్భంగా గుంటూరు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. శనివారం రాత్రి 9.15గంటలకు బస్సు బయలుదేరి గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, శ్రీకాళహస్తి దర్శనాలతోపాటు అదే రాత్రి అరుణాచలం చేరుతుందన్నారు. గిరిప్రదక్షిణ అనంతరం 13వ తేదీ ఉదయం గుంటూరుకు తిరిగొస్తుందన్నారు.