అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

NLR: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మనుబోలు మండలంలోని కట్టువపల్లికి చెందిన ఆవుల శీనయ్య (42)కు ఉన్న ఎకరా పొలంతో పాటు ఇతరుల పొలాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేశారు. ఈక్రమంలో అప్పులు ఎక్కువ అయ్యాయి. వాటిని తీర్చలేక రెండు రోజుల కిందట పురుగు మందు తాగారు. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయారు.