ఆధార్ క్యాంపు గడువు మూడు రోజులు పెంపు
MNCL: జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంపును మరో మూడు రోజులు పొడిగించడం జరిగిందని మంచిర్యాల జిల్లా పోస్టల్ అడిషనల్ సూపర్డెంట్ రామారావు తెలిపారు. శుక్రవారం చింతగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంప్‌ను ఆయన పరిశీలించారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో మూడు రోజుల గడువును పెంచామన్నారు.