అనంతపురంలో పర్యటించిన వైవీబీ రాజేంద్రప్రసాద్

కృష్ణా: ఉయ్యూరుకి చెందిన పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ అనంతపురంలో శనివారం పర్యటించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను రెండు విడతలుగా విడుదల చేసినందుకు ఆయన విలేకరుల సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన రూ.1120 కోట్లు సర్పంచుల ఖాతాల్లో వేయాలన్నారు.