VIDEO: కూరగాయల వ్యాపారులకు ఎండ కష్టాలు
JGL: మెట్‌పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డుపై కూరగాయల విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత అధికమైనా రహదారిపైనే వ్యాపారం నిర్వహించాల్సి రావడంతో అవస్థలు పడుతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. సరైన నీడ లేకపోవడంతో పాటు ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం వారి సమస్యలను మరింత పెంచుతోంది. మరోవైపు మార్కెట్ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది.