VIDEO: పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే
BDK: ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా చాపరాలపల్లి గ్రామంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఇలాంటి ఆరోగ్య శిబిరాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య సిబ్బందిని గౌరవిస్తూ వారి కాళ్లు కడిగి సత్కరించారు.