16న శ్రీకృష్ణుని ఆలయంలో కళ్యాణం

16న శ్రీకృష్ణుని ఆలయంలో కళ్యాణం

KDP: పులివెందులలో వెలసిన శ్రీకృష్ణుని ఆలయంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. ఆ మేరకు స్వామి వారికి కళ్యాణం, ఉట్టి కొట్టే కార్యక్రమం, కోలాట ప్రదర్శన, తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు.