స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లనున్న ఎమ్మెల్యే ఏలేటి
HYD: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మార్పుపై స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీఎల్పీ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇవాళ హైకోర్టుకు వెళ్లనున్నారు. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని క్వాష్ చేయాలని పిటిషన్ వేయనున్నారు. కాగా పార్టీ మార్పుపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ ఇటీవలే క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.