రేపు జమ్మికుంట డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
KNR: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరం పీజీ కోర్సుల్లో ఖాళీల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ తెలిపారు. ఎమ్మెస్సీ బోటనీ, జువాలజీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ నెల 18వ తేదిన అడ్మిషన్లు పొందే విద్యార్థులు నిర్ణీత కోర్సు ఫీజు, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు.