VIDEO: కళ్లద్దాల దుకాణం ముందు నిరసన
AKP: నర్సీపట్నంలో బీజేపీ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కార్పొరేట్ కళ్లద్దాలు దుకాణం ముందు బుధవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కళ్ళద్దాల షాపులో పనిచేసే ఉద్యోగులు పట్ల యాజమాన్యం అనుచిత వైఖరి ప్రదర్శిస్తుందని ఆరోపించారు. హిందూ ఉద్యోగులు బొట్టు పెట్టుకుని విధులకు హాజరు కావద్దని ఆదేశాలు ఇవ్వటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.