'ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలి'

'ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలి'

SKLM: ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఇవాళ రణస్థలం మండలంలో పర్యటించారు. ఈ మేరకు ఆయన వల్లభరావు పేట, సంచాం, కొండములగాం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే మిల్లర్లకు ధాన్యం అందించాలని సూచించారు. ఇందులో ఎమ్మార్వో కిరణ్ కుమార్ ఉన్నారు.