నాటు తుపాకీల ఏరివేతలో కార్డన్ సెర్చ్

నాటు తుపాకీల ఏరివేతలో కార్డన్ సెర్చ్

VZM: నాటు తుపాకీల ఏరివేతలో భాగంగా ఎస్. కోట పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీనివాస కాలనీ, బర్మా కాలనీ, కొత్త అడ్డతీగలలో బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో సుమారు 63 ఇళ్లను అణువణువున గాలింపు చర్యలు చేపట్టారు. తుపాకీలు ఉంటే స్వచ్చందంగా అప్పగించాలని కాలనీ వాసులను కోరారు. సోదాల్లో పట్టుబడితే ఆయుధ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.