అసలు దీన్ని రోడ్డు అంటారా?

KMM: మధిర మున్సిపాలిటీ దిడుగుపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌కి వెళ్లే రహదారి అధ్వానంగా తయారై నడవడానికి వీలు లేకుండా ఉందని స్థానికులు తెలిపారు. ఈ రహదారి గుండా పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అటు వాహనదారులు ప్రయాణించాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరారు.