ఆపరేషన్ సిందూర్ చిత్రాలు తిలకించిన ఎంపీ
MDK: కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రి సంజయ్ సేథీను మెదక్ ఎంపీ రఘునందన్ రావు బుధవారం దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంతో జార్ఖండ్ విద్యార్థులు గీసిన చిత్రకళా ప్రదర్శనను ఆయన తిలకించారు. విద్యార్థుల సృజనాత్మకత, వారిలో తొణికిసలాడుతున్న దేశభక్తిని చూసి గర్వంగా ఉందన్నారు.