రైతులను ఆదుకోవడమే కూటమి లక్ష్యం: యనమల
KKD: రైతులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. గురువారం తుని మండలం రాపాకలో 'అన్నదాత సుఖీభవ విజయోత్సవ' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య ఇంటింటా ప్రచారం నిర్వహించి, ప్రతి రైతును ప్రత్యక్షంగా కలుసుకుని పథకాల వివరాలతో కూడిన కరపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేశ్,తదితరులు పాల్గొన్నారు.