'పనలు తడిస్తే ఉప్పు నీటి ద్రావణం చల్లుకోవాలి'

'పనలు తడిస్తే ఉప్పు నీటి ద్రావణం చల్లుకోవాలి'

ASR: వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి ఏవో మధుసూధనరావు రైతులకు సూచించారు. సోమవారం అంతర్లలో పర్యటించారు. రైతులతో కలిసి వరి పొలాలను పరిశీలించారు. పొలాల్లో ఉన్న వరి పనలను పరిశీలించారు. పంట కోసిన రైతులు వీలైనంత వరకు వరి కుప్పలు వేసుకుని, తడవకుండా టార్పాలిన్స్ కప్పుకోవాలన్నారు. పనలు తడిస్తే మొలకలు రాకుండా ఉప్పు నీటి ద్రావణం పిచికారీ చేయాలన్నారు.