‘స్వదేశానికి 24 గంటల్లో 30 మంది నావికులు’

‘స్వదేశానికి 24 గంటల్లో 30 మంది నావికులు’

హర్మూజ్ జలసంధి వద్ద ఉన్న భారతీయ నౌకలు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 'గత 24 గంటల్లో 30 మంది నావికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ 24 భారతీయ నౌకలు ఉండగా, పరిస్థితిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. నావికుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం' అని కేంద్రం భరోసా ఇచ్చింది.