లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
NRPT: ఊట్కూరు మండలంలోని 22 గ్రామాలకు చెందిన 196 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. సుమారు రూ.1.96 కోట్ల విలువైన ఈ సాయాన్ని సర్పంచ్ల ఆధ్వర్యంలో అందజేశారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇది ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.