కార్మిక చట్టాలపై అవగాహన పరుచుకోండి

SKLM: కార్మిక చట్టాలపై ఆయా కార్మికులు అవగాహన పరచుకోవలసిన అవసరం ఎంతో ఉందని నరసన్నపేట సివిల్ జడ్జి కుమారి ఎస్ వాణి తెలిపారు. మంగళవారం మే డే వారోత్సవాలలో భాగంగా కార్మికులతో నరసన్నపేట ఎంపీడీవో సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ శ్రమ్ పోర్టల్లో ప్రతి ఒక్క కార్మికుడు నమోదు కావాలని సూచించారు.