రేగొండలో 50 మందికి సామూహిక వివాహాలు
BHPL: రేగొండ మండలం కోటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 29న దాదాపు 50 జంటల సామూహిక వివాహాలు నిర్వహించనున్నారు. ఛైర్మన్ ఆయిలి మారుతి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో HRR గ్రూప్ అధినేత మడప రశ్మిత హర్షవర్ధన్ రెడ్డి దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఫౌండేషన్ చేస్తున్న మంచి పనికి కృతజ్ఞతలు తెలిపారు.