షర్మిల ట్వీట్‌కు రోజా కౌంటర్
AP: దివంగత సీఎం YS రాజశేఖర్ రెడ్డి పాదయాత్రపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల చేసిన ట్వీట్‌కు మాజీమంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. 'కూటమి పార్టీల దత్తపుత్రికగా మారిన మీకు మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత ఉందా? YSను వ్యతిరేకించిన CBNతో చేతులు కలిపింది మీరు కాదా? YSR నిజమైన వారసుడు మా జగనన్నే. ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీ రాజకీయ పరిణతి ఏంటో అర్థమవుతోంది' అని పేర్కొన్నారు.