'ఇళ్ళకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దు'

NTR: కొండపల్లి పరిధిలోని 8, 9 వార్డుల్లో ఆదివారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎస్.కే.భాషా కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలకు అవగాహన నిమిత్తం డోర్ స్టిక్కర్లు అంటించి నిరసన వ్యక్తం చేశారు. 'మా ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దు.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి' అని నినాదాలు చేశారు. ఆదాని స్మార్ట్ మీటర్లు ఆపాలని, లేకుంటే ఆందోళన చేస్తామన్నారు.