కోడి పందాల శిబిరంపై దాడి.. 9 మంది అరెస్టు

కోడి పందాల శిబిరంపై దాడి.. 9 మంది అరెస్టు

ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ పోలాల్లో కోడి పందాలు స్థావరంపై దాడి చేసామని చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ శనివారం రాత్రి తెలిపారు. ఈ దాడిలో 9 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి రూ.3550, రెండు కోళ్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై సూర్య భగవాన్ పేర్కొన్నారు.