బైరవాణి తిప్ప ప్రాజెక్టుకి తగ్గిన ఇన్ ఫ్లో

ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండంలో ఉన్న బైరవాని తిప్ప ప్రాజెక్టు(బీటీపీ)కి ఇన్ ఫ్లో తగ్గిందని జలవనరుల శాఖ ఏఈ హరీష్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ సామర్థ్యము 1655 అడుగులు కాగా శనివారం ఉదయం నాటికి 1651.2 అడుగుల మేర నీరు చేరిందన్నారు. గత వారం రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపత్యంలో భారీగా వరద కొనసాగిందన్నారు.