బేతంచెర్లలో కబడ్డీ పోటీలు..!
NDL: బేతంచెర్ల మండలం హెచ్.కొట్టాలలో శ్రీరామనవమి సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. శనివారం జరిగిన ఈ పోటీల్లో 16 జట్లు పాల్గొన్నాయి. ప్యాపిలి ప్రథమ, మామిదాలపాడు ద్వితీయ, బేతంచెర్ల తృతీయ స్థానాలు సాధించగా.. బనగానపల్లె నాలుగో స్థానం దక్కించుకుంది. విజేతలకు రూ.35 వేలు, రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు నగదు బహుమతులు అందజేశారు.