VIDEO: రేషన్ షాప్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన MLA
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలో గల రేషన్ డీలర్ పద్మావతి రేషన్ షాపును MLA హరీష్ బాబు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపుకు వచ్చిన రేషన్ బియ్యాన్ని పరిశీలించి సన్న బియ్యం పంపిణీ జరుగుతున్న సరళిని డీలర్‌ని అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని నెలలుగా కమిషన్ రావట్లేదని డీలర్ తెలుపగా, సమస్యను పరిష్కరిస్తామని MLA హామీ ఇచ్చారు.